మీరు బ్లాగిల్లులో ఏమి కోరుకుంటున్నారు ?

     గత కొన్ని నెలలుగా మిగతా భారతీయ భాషల్లో బ్లాగు ఆగ్రిగేటర్లు పెరుగుతూ ఉండగా తెలుగులో మాత్రం 'సమూహము', 'సంకలిని' లు మూతపడగా ఈమధ్యే  'హారం ' తెగిపోయింది. ఇక మిగిలి ఉన్నవి కూడలి,మాలిక , జల్లెడ, బ్లాగిల్లు.
    ప్రస్తుతం ఉన్న సంకలినుల్లో తెలుగు బ్లాగర్లు అందరికీ సుపరిచితమైనది కూడలి. సంకలినిలు చూసే మొత్తం బ్లాగర్లలో దాదాపు 80 శాతం కూడలిని తప్పక చూస్తారు.
ఇకపోతే సరికొత్త ఆలోచనలతో మొదలైన బ్లాగిల్లు విభిన్న శీర్షికలతో ఆకట్టుకుంటున్నది. అన్నిసంకలినిలను చూసేవారూ బ్లాగిల్లు కు  కనీసం రోజుకి ఒకసారైనా వస్తున్నారు. బ్లాగిల్లు ఒక సంకలిని మాత్రమే కాదు ఇది తెలుగు బ్లాగుల ఇల్లు అని తెలుగు బ్లాగుల ప్రయోగశాల అని ఇంతకూ ముందే ఓ సారి చెప్పాను.తెలుగు బ్లాగర్లు ఏమి కోరుకుంటున్నారో అది బ్లాగిల్లు అందించదానికి ఎప్పుడూ ముందు ఉంటుంది .కొద్దిగా విభిన్నంగా ఆలోచించడంలో ముందుండే ప్రయత్నం చేస్తుంది.
       ప్రస్తుతం ఏ సంకలిని చూసినా వార్తలమయం అయిపోయింది. ఉన్న వేలాది బ్లాగులలో ఏది వార్తా బ్లాగో గుర్తించడం కష్టమే . విభిన్న టపాలు అందించే బ్లాగులు కూడా ఒక్కోసారి వార్తలనే వ్రాస్తున్నారు .వార్తాబ్లాగులనుండి కూడా ఒక్కోసారి మంచి ఆలోచింపజేసే టపాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి త్వరలో బ్లాగిల్లులో విభాగాలు ప్రారంభమవబోతున్నాయి. వాటిని 'బ్లాగు ఏదైనా'  వ్రాసిన టపా ఆధారంగా సంభందిత విభాగంలోకి చేరే విధంగా రూపొందిస్తున్నాము.
      బ్లాగిల్లులో ఉండవలసిన విభాగాలు, శీర్షికల విషయంలోమీ అందరి సలహాలనూ ఆహ్వానిస్తున్నాను.
మరింత విభిన్నంగా ఆలోచించి తమ సూచనలు చేయవలసిందిగా ప్రార్ధన.


7 comments:

  1. "హారం"లో ఉండిన కొన్ని ప్రత్యేకతలు :

    1. ఎక్కువ పోస్టుల వివరాలు ఎక్కువ కాలం స్క్రీన్ మీద లైవ్ గా కనిపించడం.
    2. ఆసక్తికరమైన పోస్టులను ఒక జాబితా చేసి, "ఓ లుక్కేయండి" అని సూచించడం.
    3. ఎక్కువగా చదివిన పోస్టుల జాబితాను ప్రత్యేకంగా ప్రదర్శించడం.
    4. సాహిత్య బ్లాగుల (ముఖ్యంగా పద్య సాహిత్య బ్లాగుల) పోస్టుల జాబితాను ప్రత్యేకంగా ప్రదర్శించడం.
    5. వాదమేదైనా అందరి భావజాలాలకు సమాన ప్రతిపత్తిని కల్పించడం.

    "బ్లాగిల్లు" కూడ వీటిని చేర్చే విషయం పరిశీలిస్తే బాగుంటుందని నా సూచన.

    ReplyDelete
  2. డా.ఆచార్య ఫణీంద్ర గార్కి ,
    నమస్కారములు. మీరుతెలిపిన 1,2,3,5 అంశాలు ఇప్పటికే బ్లాగిల్లులో ఉన్నాయి . http://blogillu.com/blogs ( సంకలిని) విభాగాన్ని ఒక్కసారి వీక్షించగలరు.
    ఇక 4 వ అంశంలో తెలిపిన విధంగా సాహిత్యానికి ప్రత్యెక విభాగం రాబోతుంది.
    ఇంకా ఏ ఏ విభాగాలు కావాలో తెలుపమని వీక్షకులకు విన్నపం.

    ReplyDelete
  3. ఒకే రోజు ఎక్కువ మంది కనుక వ్రాస్తే, భారత్ లో ఉదయం 6 గంటలకి వేసిన పోష్టు సాయంత్రమే "కూడలి"లో కనుమరుగు అవుతోంది. అదే పోష్టుని న్యూయార్క్ వాసి చదవాలంటే కుదరటం లేదు. అందుకని, భారత్ లో ఉదయం ఆరుగంటలకి వేసిన పోష్టులన్నీ కూడా అమెరికాలో రాత్రి 10 గంటలు అయ్యేవరకు ఉండేటట్లు చూడగలరు.

    ReplyDelete
    Replies
    1. రాధాకృష్ణ గార్కి నమస్కారం
      http://blogillu.com/blogs ( సంకలిని) లో గత కొద్ది నెలల టపాలు కూడా ఉంటాయి అలాగే http://blogillu.com/m ( mobile version) చూడగలరు.

      Delete
  4. బ్లాగిల్లు వారికి,
    ఆర్యా!
    మీరు అభిప్రాయం చెప్పమన్నారు కనక మీకు సూచన వీలు కుదిరితే ఆచరించండి.
    హారం లో విశిష్టత గమనించండి. టపా వెంటనే కనపడుతుంది. ఆ తరవాత పక్కన ఎక్కువమంది చదివినద్వి, వీటినో లుక్కెయ్యండి కనపడతాయి. మీరు టపాలను విభాగం చేయడం తో టపాలను వెతుక్కోడానికే సమయం సరిపోతుంది. అందుచేత ఒక రోజు రాసిన టపా నలభై ఎనిమిది గంటలు కనపడేలా చూడండి. వ్యాఖ్యలు హారం లో లా వెంటనే కనపడేలా, ఒకరి వ్యాఖ్యలన్నీ ఒక చోట కనపడేలా చేయగలిగితే చాలా బాగుంటుంది ఇది కాపీ కొట్టడంగా భావించక ఆ సదుపాయాలు చేస్తే సామాన్యులు మీ ఆగ్రిగేటర్ ని వదలలేరు. నిజంగానే చెబుతున్నా. హారం తెగిన తరవాత బ్లాగు గతి తప్పిందంటే మాలా రోజూ రాసేవారికి చాలా ఇబ్బందిగానే ఉంది. సూచనలు గమనించి చేయగలిగ్తే సంతసం. PLZ remove word verification

    ReplyDelete
    Replies
    1. ఆర్యా !
      http://blogillu.com/m ( mobile version) చూడగలరు.దీనిలో టపా వ్రాసిన కొద్ది సెకన్లలో కనపడుతుంది
      అలాగే http://blogillu.com/blogs ( సంకలిని) లో గత కొద్ది నెలల టపాలు కూడా ఉంటాయి

      Delete
  5. I wish to publish an article on this issue shortly

    ReplyDelete

hit counter