సాంబారు గాడు


Generated by WebThumbnail.org


ఈ బ్లాగు రచయిత: సాంబారు గాడు
తన గురించి తాను: నేనూ మీ అందరిలా ఈ సృష్టికి కేంద్ర బిందువుని నేనే అన్న భ్రమతో, అహం తో బ్రతికిన వాడినే. గత జన్మలోని సాధన ఫలితంగా ఈ జన్మలో నాకు అందిన సూచనలను అందుకుని పాటించిన ఫలితంగా మరణానికి ఏక్షణమైనా కరచాలనం చేసే స్థితికి ఎదిగాను.అవును మరణాన్ని ఎదుర్కోవడానికి నేర్చుకోవడమే జీవిత ధ్యేయమై ఉండాలి. ఎంత బతుకు బతికినా చావడం ఖాయం. మరి ఆ చావును ఎదుర్కొనే సత్తా లేక ఏం బతికినా ఏముంటుంది గర్వకారణం?
మనమందరం ఎప్పుడో ఏదో రూపంలో కలిసే ఉన్నాం. ఒక మహా విశ్ఫోటం కారణంగా చెదిరిపోయాం. మళ్ళి కలవాలని తపిస్తున్నాం. ఆ కలయకకు మన శరీరాలే అడ్డమని అపోహ పడుతున్నాం. శారీరికంగా కలావాలని ప్రయత్నిస్తాం అసే సెక్స్. లేదా మన శరీరాలను వదిలించుకోవడానికి హత్యలు,ఆత్మ హత్యలకు పాల్పదుతున్నం. ఒక్కసారిగా హత్య,ఆత్మ హత్య దైర్యం చాలనివారం వాయిదాల్లో ప్రయత్నిస్తున్నాం. లేదా చావడానికి/చంపడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుంటున్నాం. అవే డబ్బు,సెక్స్,అధికారం,కీర్తికాంక్ష. ఇంతకీ మనం కలవడానికి అడ్డం ఈ శరీరాలు కావు. మన అహమే, మన స్వార్థమే. అహాన్ని త్యజిస్తాం,. స్వార్థం వీడూఅం. మనమందరం ఒక్క తల్లి బిడ్డలమే . కలిసి ఉంటే కలదు సుఖము. కలిసి వచ్చును అద్రుష్ఠము

సాంబారు గాడి వృత్తాంతం: సాంబారు అన్నది తమిళులకు ప్రీతి పాత్రమైన ఐటమ్. అందుకని తంఇళులను సాంబాగాళ్ళు అంటారు. హైదరాబాద్ లో టమోటా అని కూడా అంటారట. మానన్నకు నేటివ్  తమిళనాడు లోని ఆరణి, అమ్మకు  అరక్కోనం. బాల్యంలోనే చిత్తూరులో స్థిరపడిన మా నాన్న జిల్లా ఖజాణా అధికారిగా పని చేసారు.నా మాతృ భాష తమిళమే అయినా ఎన్.టి.ఆర్ మీద అభిమానంతో తెలుగు నేర్చుకున్నాను. నాఉ నచ్చిన తెలుగు సిని గేయ రచయిత వేటూరి, స్క్రిప్ట్ రైటర్ పరచూరి బ్రదర్స్, డైరక్టరు కె.రాఘవేంద్రరావు. 

ఇంతకీ నాకు బ్లాగ్ ప్రపంచంలో ఈ టైటిల్ ఎలా వచ్చిందో చెప్పాలిగా?2009 ఎన్నికల్లో వై.ఎస్. మళ్ళీ  సెఇఎమ్ అవుతారని, చిరంజీవికి యాబై లోపే సీట్లు వస్తాయని. జ్యోతిష్య రీత్యా ముందుగా గణించి తెలపడంతో చిరు అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు (తె.దే.పా కార్యకర్తలు ) నన్ను ఈ పద ప్రయోగంతో తిట్టేవారు.ఈ పదం ఏదో విదంగా ప్రాభల్యం పొందటంతో  నా తదుపరి బ్లాగుకు ఈ పెరే పెట్టుకున్నాను


బ్లాగిల్లు రివ్యూ : ఈ బ్లాగులో రచయిత సమాజం లోని అన్ని అంశాలనూ సృజించారు. తాను నమ్మిన జ్యోతిషాని కొన్నింటిలో మిక్ష్ చేసారుకూడా... మొత్తానికి ఆశక్తికరమైన బ్లాగు ఇది..

ఈ బ్లాగులోని తాజా టపాలు :

No comments:

Post a Comment

hit counter